అకస్మాత్తుగా కన్ను కొట్టుకోవడం శుభమా? అశుభమా!

samatha 

20 JUN  2025

Credit: Instagram

అప్పుడప్పు కళ్లు అదరడం అనేది చాలా కామన్. చాలా మందికి కళ్లు అదరుతుంటాయి. ఇది చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంటుంది.

అయితే కొన్నిసార్లు  అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కళ్లు కొట్టుకుంటాయి. ఇంకొంతం మదికి మాములుగానే కన్ను అదరడం జరుగుతుంది.  అది దానంతట అదే తగ్గిపోతుంది.

అయితే హిందూ మతంలో కన్ను అదరడం లేదా కొట్టుకోవడం అనేది శుభ, అశుభ సంకేతాలను చూపిస్తుంది. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

హిందూ మతంలో స్త్రీలు లేదా పురుషుల కళ్లు అదరడంపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

స్త్రీలకు ఎడమ కన్ను అదరడం చాలా మంచిది. శుభసూచకం. దీని వలన వారి జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం అంటున్నారు పండితులు.

అదే విధంగా స్త్రీలకు కుడి కన్ను అదరడం అనేది అశుభ సూచకం. దీని వలన త్వరలో వీరికి ఏదో చెడు జరుగుతుందని అర్థంట.

అలాగే పురుషులకు కుడి కన్ను అదరడం అనేది వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. దీని వలన వీరికి త్వరలో ఏదో మంచి జరుగుతుందని అర్థం. 

అదే విధంగా పురుషులకు ఎడమ కన్ను అదరడం చాలా అశుభ సూచకం. దీని వలన వారి జీవితంలో ఏదో చెడు జరగబోతుందని అర్థం అంటున్నారు పండితులు.