వర్షాకాలంలో ఆవనూనెతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

samatha 

22 JUN  2025

Credit: Instagram

ఆవనూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా , అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవనూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వర్షకాలంలో ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుందంట.

గోరు వెచ్చటి ఆవనూనెతో మసాజ్ చేసుకోవడం వలన ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

ఆవ నూనెలో అనేక పోషకాలు ఉంటాయి. అయితే దీనిని తీసుకోవడం వలన ఇది కడుపు ఉబ్బరం, బరువు , ఆకలిని నివారించడంలో సహాయపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా వర్షాకాలంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో సతమతం అవుతారు. కాగా, ఈ కాలంలో ఆవనూనె ఆవిరి పీల్చడం వలన ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చే జలుబు, దగ్గును తగ్గిస్తుంది.

ఆవనూనెలో యాంటీ  మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది చర్మాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహారిస్తుంది. ప్రతి రోజూ దీనిని చర్మానికి అప్లై చేసుకోవడం వలన చర్మ వ్యాధులు రావంట.

చర్మానికే కాకుండా ఈ ఆవ నూనె జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది వర్షాకాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతారు. అయితే ఇది చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను తొలగిస్తుందంట

ఆవనూనెతో ప్రతి రోజూ కీళ్ల సమస్యలు ఉన్న వారు దీంతో మసాజ్ చేసుకోవడం వలన కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.