నీళ్లలో కాదండోయ్.. నేలపై నడిచే ఈ చేపలు చూశారా!

samatha 

24 JUN  2025

Credit: Instagram

చేపలు అందరికీ తెలుసు ఇవి ఎక్కువగా నీటిలో ఉంటాయి. ఇక నేల మీద వేస్తే నడవ లేవు. నీటిలో తేలియాడుతూ చూడటానికి చాలా అందంగా ఉంటాయి.

అయితే నీటిలోనే కాకుండా నేల మీద కూడా నడిచే చేపలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కాగా, వాటి గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మడ్ స్కిప్పర్ చేప. ఇది నీటిలో కాదు నేలమీద కూడా నడవగలదు. ఈ చేప దాని రెక్కలను ఉపయోగించి బురద, చదును నేలల్లో సులభంగా నడుస్తుందంట.

లంగ్ ఫిష్ . అందమైన చేపల్లో ఇదొక్కటి. ఈ చేప కొన్ని కష్టసమయాల్లో బురదను తవ్వి అందులో నుంచి నడుస్తుంంట. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.

లాంగ్లూర్ ఫ్రాగ్ ఫిష్. ఇది చూడటానికి కాస్త డిఫరెంట్‌గా భయంకరంగా ఉంటుంది. ఇది పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి తమ రెక్కలతో నడవగలవంట.

క్లైంబింగ్ పెర్చ్. చూడటానికి చిన్నగా కనిపించే ఈ చేపకు ఎక్కువ రెక్కలుంటాయి. ఇవి తమ రెక్కలను ఉపయోగించి సులభంగా నేలపై నడవగలవంట.

కేవ్ ఏంజెల్ ఫిష్. ఇది అందమైన చేపల్లో ఇదొక్కటి. ఈ చేప థాయ్ జాతికి చెందినది. ఈ చేప తన రెక్కలను ఉపయోగించి రాళ్ల వెంబడి నదుల వైపు పాకుతూ వెళ్తుంది.

వాకింగ్ క్యాట్ ఫిష్. ఇది కొత్త నీటి సరస్సుల కోసం భూమిపై తిరుగుతూ ఎక్కువగా నీరు ఉండే ప్రదేశాలకు వెళ్తుంటుంది. ఈ చేప ఆగ్నేయాసియాలో తక్కువ ఆక్సిజన్ గల ప్రాంతాల్లో నివసిస్తాయి.