ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఒక్కచోట ఎందుకు ఉండకూడదో తెలుసా?
samatha
26 JUN 2025
Credit: Instagram
ఆషాఢ మాసం వచ్చేసింది. ఈరోజు కొత్తగా పెళ్లైన మహిళలు తప్పకుండా తమ పుట్టింటికి వెళ్లాలి అంటారు. మరీ ముఖ్యంగా నూతన వధూవరులు కలిసి ఉండకూడదంటారు.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢ మాసంలో ఎందుకు కలిసి ఉండకూడదు? దీని కారణం ఏంటో? కాగా, దీని గురించి తెలుసుకుందాం.
ఆషాఢ మాసంలో నవ దంపతులు కలిసి ఉండకూదడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. అందులో వారి ఆరోగ్యం
ఆషాడ మాసం ప్రారంభంలో, వాతావరణం తేమగా, చల్లగా మారుతుంది. ఇది శరీరంలో వైరస్, బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో గర్భం దాల్చితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంట. అందుకే దంపతులను దూరం పెడతారంట.
అలాగే ఆషాఢంలో వర్షాకాలం ప్రారంభమైన విత్తనాలు విత్తే పని జరిగేది. అయితే కొత్తగా పెళ్లైన జంటలు కలిసి ఉంటే, కొత్త అనుబంధం వారిని వ్యవసాయ పనుల నుండి దూరం చేస్తుందని వ్యవసాయపనులకు ఆటకం లేకుండా వీరిని దూరం ఉంచుతారంట.
ఇదే కాకుండా కొత్తగా పెళ్లైన వారు ఒక నెల రోజుల పాటు దూరం ఉండి మళ్లీ కలుసుకోవడం ద్వారా వారి బంధం మరింత బలపడుతుందని పెద్దల నమ్మకం.
అందుకే విడిపోయిన తర్వాత కలిసే ఆనందం దాంపత్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని వారు ఈ మాసంలో నవ వధువును తన పుట్టింట్లో ఉండాలని చెబుతారంట.