మిమిక్రీ చేసే ఈ పక్షి గురించి తెలుసా.. ఇదో అద్భుతం!

samatha 

27 JUN  2025

Credit: Instagram

ప్రకృతిలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి. ఒక్కో దానికి ఒక ప్రత్యేకత ఉంటాయి. కొన్ని అందంగా నాట్యం చేస్తే, మరికొన్ని తీయగా కూస్తుంటాయి.

ఇలా ఎన్నో రకాల పక్షులు ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా మిమిక్రీ చేసే పక్షి గురించి విన్నారా? అయితే ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

లైర్ బర్డ్ అనే పక్షి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకృతి ఇచ్చిన గొప్ప సంపదలో ఇదొక్కటి. ఈ పక్షి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటుంది.

ఇది మిమిక్రీ చేయడం ( అనుకరణ)లో మాస్టర్ అనే చెప్పాలి. చైన్సాలు, కెమెరా శబ్ధాలు, అలారాలు వంటి 20కి పైగా శబ్ధాలను ఇది అనుకరిస్తుందంట.

ఇక ఈ పక్షుల్లో మగ లైగర్ వి వంపు తిరిగిన పొడవాటి పెద్ద పెద్ద ఈకలతో కూడని తోకతో ఉంటుందంట. ఇవి ప్రేమను పచడంలో నెంబర్ వన్ అంట.

లైర్ బర్డ్ తన చుట్టూ ఉండే పరిసరాలను అనుసరించి, అక్కడి శబ్ధాలను మిమిక్రీ చేస్తుందంట. అడవి శబ్ధాలను కూడా ఇది తన గొంతుతో వినిపిస్తుందంట.

జూనియర్ లైర్ బర్డ్స్ అనేవి అనుకరణను నేర్చుకోవడానికి దాదాపు సంవత్సరాలే పడుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి డేవిడ్ అటెన్ బరో వన్యప్రాణులో చోటు సంపాదించుకోవడంతో గుర్తింపు తెచ్చుకున్నాయి.

అయితే లైర్  బర్స్‌కి చాలా టాలెంట్ ఉన్నప్పటికీ, ఇవి చాలా పిరికివి అంట . వీటి భయంతో ఇవి ఎక్కువగా గుంపులుగా ఉండే ప్రదేశాల్లో దాగుంటాయంట.