పాములను తినే ఈ పక్షులను మీరెప్పుడైనా చూశారా?

samatha 

29 JUN  2025

Credit: Instagram

పాములు చాలా విషపూరితమైనవి. వాటిని చూస్తేనే చాలా మంది భయపడి పోతుంటారు. ఇక వాటిని పట్టుకోవడం కూడా కష్టమే.

కానీ కొన్ని పక్షులు మాత్రం ఏకంగా వాటిని పట్టుకొని, తింటుంటాయంట. కాగా, పాములను తినే పక్షులు ఏవో అవి ఎక్కడెక్కడున్నాయో చూద్దాం.

సెక్రటరీ బర్డ్. ఆఫ్రికాకు చెందిన ఈ పక్షి చూడటానికి కోడి మాదిరి కనిపిస్తుంది. కానీ ఇది ఎంతటి విషపూరితమైన పాములనైనా సరే తన పదునైన ముక్కుతో చంపేస్తుందంట.

క్రెస్టెడ్ కారకారా ఇది వేటాడే పక్షి. ఈ రకం పక్షులు ఎక్కువగా అమెరికాలో కనిపిస్తాయి. అయితే ఈ పక్షులు తమ అద్భుతమైన దృష్టితో పాములను వేటాడి చంపుతాయంట.

పాములను వేటాడి చంపే పక్షుల్లో బ్రౌన్ స్నేక్ డేగ ఒకటి. ఇది తన గోళ్లతో ఎంత పెద్ద పాములపైన అయినా సరే దాడి చేసి చంపేస్తుంది.

ఎగిరే పాములను పట్టుకోవడంలే మేటి పొట్టి బొటన వేలుగల గ్రద్ధ ఇది ఎటువంటి పాములనైనా తన బొటనవేళులో బంధించి చంపేస్తుందంట.

ఉత్తర అమెరికాలోని స్పీడ్ బర్డ్. ఇది ఒంటరిగా దాడి చేయదు. దాని భాగస్వామి సహాయంతో చాలా వేగంగా పాములపై దాడి చేసి వాటిని చంపేస్తుందంట.

కొమ్ముల గుడ్ల గూబ.  ఇది చాలా చురకైన పక్షి. ఈ రకం పక్షి రాత్రి పూట మాత్రమే ఎక్కువగా చురుకుగా ఉంటుందంట. అలాగే ఇవి పాముల త్వరగా వేటాడుతుందంట.