వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది వేడి వేడిగా మొక్కజొన్న తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ట చూపిస్తుంటారు.
ఇది రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కావడంతో, చాలా మంది ఉడకబెట్టి లేదా కాల్చిన మొక్కజొన్న తినడానికి ఇష్టపడుతారు.
అయితే వర్షాకాలం మొదలైంది. దీంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. కాగా, అసలు ఈ సీజన్‌లో మొక్కజొన్న తినడం మంచిదేనో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో స్వీట్ కార్న్ శరీరానికి చాలా మంచిదంట. అందుకే దీనిని ఈ సీజన్‌లో తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
స్వీట్ కార్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేసి, మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుందంట.
అదే విధంగా, స్వీట్ కార్న్‌లో ఉండే ఖనిజాలు , విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయంట.
మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, శరీరంలోని కణాలు దెబ్బతినకుండా రక్షించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయంట. అందుకే వర్షకాలంలో తినడం చాలా మంచిది.
అలాగే స్వీట్ కార్న్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, అంటు వ్యాధుల నుంచి రక్షిస్తుందంట.