చాణక్యనీతి : ప్రతి వ్యక్తి ఈ 3 విషయాలకు దూరం ఉండాలంట!
Samatha
4 july 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప తత్వవేత్త. అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. అవి నేటి వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అయితే ఆ చార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందాలి, సమాజంలో గౌరవంగా బతకాలంటే మూడు విషయాలకు దూరం ఉండాలంట.
కాగా, అవి ఏవి? ఎలాంటి విషయాలకు దూరం ఉండటం వలన జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారో ఇప్పుడు చూద్దాం.
ఒక ఏ వ్యక్తి అయినా సరే తమను తాము అస్సలే ప్రశంసించుకోకూడదంట. దీని వలన మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.
తనను తాను ప్రశంసించుకునే వ్యక్తి, సమాజంలో ఇమేజ్ పాడు చేసుకోవడమే కాకుండా, ఇతరుల దృష్టిలో తమ నమ్మకాన్ని క్రమంగా కోల్పోతాడంట.
ఎప్పుడూ కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎప్పుడూ ఇతరులను విమర్శిస్తూ, వారి గురించి చెడుగా మాట్లాడితే, అలాంటి వ్యక్తి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతాడంట.
ఇతరులలో తప్పులు వెతుకుతున్న వ్యక్తి ఎప్పుడూ తనలోని తప్పులను చూడలేడని, అందుకే ఇతరులలో తప్పులను చూడటం మానుకోవాలంటున్నాడు చాణక్యుడు.