అందంగా డ్యాన్స్ చేసే ఈ పక్షులను మీరెప్పుడైనా చూశారా?
Samatha
4 july 2025
Credit: Instagram
ప్రకృతి మనకు అనేక రకాల పశుసంపదను అందించింది. ఈ భూమిపై అనేక రకాల పక్షులు, జంతువులు ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇక ఇందులో కొన్ని రకాల పక్షులు తమ గాత్రంతో ఆకట్టుకుంటే, మరికొన్ని మాత్రం అందంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ కట్టిపడేస్తాయి.
ఇక చాలా మందికి నెమలి గురించి తెలుసు. ఇది తన రెక్కలను పురివిప్పి ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే దీనిలానే చాలా పక్షలు కూడా డ్యాన్స్ చేస్తాయంట.
బర్డ్ ఆఫ్ పారడైజ్ అనే మగ పక్షి, ఆడ పక్షిని ఆకట్టుకోవడానికి లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ, తన నల్లటి ఈకలను విప్పుతూ ఆడుతుంది.
మనాకిన్, ఇది అమెరికాకు చెందినది. ఈ పక్షి ఎక్కువగా పండ్లు తింటుంది. అలాగే ఇది ఎర్రటిటోపి గల తలతో నల్లటి చర్మంతో ఉంటుంది. ఇవి నృత్యాన్ని అద్భుతంగా చేస్తాయంట
నీలి పాదాల బూబీలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఎక్కువగా చేపలను వెంటాడి తింటాయి. ఇవి తమ పాదాలను పైకి లేపుతూ హై స్టెప్ డ్యాన్స్ చేస్తాయి.
విక్టోరియా రైఫిల్ బర్డ్. ఇది నిగనిగలాడే నల్లటి రెక్కలతో ఉంటుంది. ఇది తన రెక్కలను ఊపుతో ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తుందంట.
విలన్స్ బర్డ్ ఆఫ్ పారడైస్. ఇది ఇడోనేషియాకు చెందిన పక్షి. ఇది పండ్లు, కీటకాలను తింటుంది.ఈ పక్షి ఆడపక్షులు ఆకర్షించడానికి డ్యాన్స్ చేసే ముందు వేదికను క్లీన్ చేసుకుంటుంది.