జాగ్రత్త సుమా.. టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతున్నారా!
Samatha
13 july 2025
Credit: Instagram
ఉదయం అయ్యిందంటే చాలు తప్పకుండా టీ తాగాలని అంటుంటారు.ఇక ఒకరు ఒకరోజు లో ఒకసారి టీ తాగితే, కొంత మంది మాత్రం రోజులో రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు.
అయితే కొందరు ఉదయం పరగడుపునే టీ తాగితే మరికొంత మంది మాత్రం తిన్న తర్వాత టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఇక ఆఫీసులో వర్క్ చేసేవారు రోజులో కనీసం రెండు లేదా మూడు సార్లు టీ తాగుతారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ చేసిన వెంటనే టీ తాగడం కామన్.
కానీ ఇలా తాగడం వలన కాస్త ప్రశాతంగా, తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంటున్నారు నిపుణులు.
టిఫిన్ చేసిన వెంటనే టీ తాగడం వలన అది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందంట. దీని వలన జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నదంట.
ఎప్పుడైతే టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతారో, జీర్ణవ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. దీంతో పోషక పదార్థాలు పూర్తిగా శరీరం తీసుకోదు. దీంతో కడుపునొప్పి సమస్యలు వస్తాయి.
అంతేకాకుండా తిన్న వెంటనే టీ తాగడం వలన అది రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా కడుపులో సమస్యలకు కారణం అవుతుందంట.
ఎప్పుడైతే టిఫిన్ లేదా, భోజనం చేసిన తర్వాత టీ తాగుతారో అది కడుపులో ఎసిడిటీ పెంచుతుందంట. అందుకే అస్సలే టిఫిన్ చేసిన వెంటనే కాకుండా 15 నిమిషాల తర్వాత టీ తాగాలంట.