ప్రపంచంలోనే అందమైన రంగురంగుల రామచిలుకలు ఇవే!

Samatha

14 july  2025

Credit: Instagram

రామ చిలుకలంటే చాలా మందికి ఇష్టం. ఇవి చాలా అందంగా ఉండటంతో వీటిని చూసే కొద్ది చూడాలనిపిస్తుంది.

ఇక ప్రపంచంలో అనేక రకాల చిలుకలున్నాయి. కాగా, ఇందులో చూడగానే వావ్ అనిపించేంత అందమైన చిలుకలు కూడా ఉన్నాయంట.

చూడగానే వావ్ అనిపించేలా ఉండే చిలుకల్లో బుడ్గేరిగర్ ఒకటి. ఇది రంగు రంగులతో చాలా అందంగా ఉంటుంది.

చూడటానికి చిన్నగా ఉన్నా బంధంలో మాత్రం వీటికి సాటిలేరు. ప్రేమను చాటడంలో గొప్పగా ఉండే లవ్ బర్డ్ చిలకలు చాలా అందంగా ఉంటాయి.

తెలుపురంగులో చాలా చిన్నగా కనిపించే కాకాటియల్ రామ చిలుక చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

మాట్లాడే సామర్థ్యం ఉన్న చిలుకల్లో రామ చిలుక( ఇండియన్ ప్యారెట్) ఒకటి. ఇది ఆకు పచ్చరంగులో చూడటానికి అందంగా ఉంటుంది.

ఆకాశంలోని ఇంద్రధనస్సు రంగులో ఉండే రెయిన్పో లోరికీట్ చిలుకను చూడటానికి రెండు కళ్లు చాలావు. ఇవి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి.

ఎక్లెక్టస్ చిలుకలు. ఆడ చిలుకలు ముదురు ఎరుపు రంగులో, మగ రామచిలుకలు ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. ఇవి చాలా తెలివైనవి.