వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Samatha

16 july  2025

Credit: Instagram

మొక్కజొన్న ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా మక్కజొన్న తింటుంటారు.

ఇక వర్షాకాలంలో అయితే చెప్పాల్సిన పని లేద, ఓ వైపు వర్షం పడుతుంటే, మరోవైపు మొక్కజొన్న కాల్చుకొని వేడి వేడిగా తింటుంటారు.

కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

వర్షాకాలం వస్తే చాలు, చాలా మందికి ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది మరీ ముఖ్యంగా మొక్కజొన్న తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది.

ఇక ఇందులో విటమిన్స్, ఖనిజాలు, యాటీఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి ఎక్కువ మొతాదులో ఉంటాయి. అందుకే ఈ సీజన్‌లో మొక్కజొన్న తినడం చాలా మంచిదంటారు.

మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియను మెరుగుపచడమే కాకుండా ఫైటోకెమికల్స్ అనేవి వ్యాధులను నుంచి రక్షిస్తాయి

వర్షాకాలంలో ప్రతి రోజూ కాల్చిన మొక్క జొన్న తినడం వలన ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. శరీరానికి చాలా మేలు చేస్తుందంట.

అలాగే, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి  ఇది ప్రయోజనకరం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందంట.