చర్మానికి మేలు చేసే చిలకడదుంపలు..! లాభాలు తెలిస్తే..

Jyothi Gadda

22 May 2025

చిలకడ దుంపలు కేవలం ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు. అవి చర్మ ప్రయోజనాల నిధి. ఈ రంగురంగులచిలకడ దుంపలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.

చిలకడ దుంపను పులుసు, వేపుడు, ఉడక పెట్టడం, నిప్పుల పై కాల్చి తీసుకుంటూ వుంటారు. అన్నింటి కన్నా కాల్చుకుని తింటే దాని రుచే వేరుగా వుంటుంది. 

చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ 'డి'ని పుష్కలంగా కలిగి ఉంటుంది. 

చిలకడ దుంప తినటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. ఇందులో విటమిన్ 'సి' కలిగి ఉండి, జలుబు, ఫ్లూ లను తగ్గిస్తుంది. దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాలఉత్పత్తిని పెంచుతుంది. 

కొల్లజన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి, క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది.

చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయ స్పందన, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను తగ్గిస్తుంది.

పొట్టలో ఏర్పడే అల్సర్‌లను తగ్గి్స్తుంది. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి, పిండి పదార్థాలతో కూడిన ఈ ఆహారం, అసిడిటీ సమస్యలను, మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి.