తెల్ల అన్నాన్ని వేడిగా తింటే మంచిదా, చల్లగా తినాలా..?
Jyothi Gadda
18 July 2025
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కానీ, పెరిగిన అవగాహన కారణంగా చాలా మంది వైట్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాదని పక్కనపెట్టేస్తున్నారు. కానీ, ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.
మనం రోజులో ఏం తిన్నా అన్నం తిన్నంత తృప్తిగా అనిపించదు. అందుకే అన్నం తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. వైట్ రైస్ మంచిది కాదని, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటివి తినాలని చెబుతారు.
దీంతో చాలా మంది వీటిని తినడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ప్రయత్నించి ఆ రుచి వారికి నచ్చక కడుపుకి తృప్తినివ్వక పోవడంతో తిరిగి వైట్‌రైస్‌ని తింటారు.
కానీ, ఈ రైస్‌ని కూడా తినడం వల్ల ఎక్కువగా ఎలాంటి సమస్యలు లేదు. దానిని మనం విలన్‌లా చూడాల్సిన అవసరం లేదు. తెల్ల అన్నాన్ని సరైన విధంగా తీసుకుంటే మంచిదేనని చెబుతున్నారు.
అయితే, కొద్దిగా తింటే దాంతో మనకి కడుపు నిండినట్లుగా కూడా అనిపించదు. తెల్లబియ్యంలో కార్బోహైడ్రేట్స్, కేలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
ఇవి తింటే శరీర బరువు పెరగడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. అలాంటి సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే అన్నం బదులు హెల్దీ ఆప్షన్స్ వెతుక్కోవాలి.
ఇది బరువు పెరగడానికి, మధుమేహానికి దారితీయవచ్చు. జీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, మధుమేహులు తగ్గించుకోవడం మంచిది.
తెల్ల బియ్యాన్ని పూర్తిగా మానేయకపోయినా, దాని వినియోగాన్ని తగ్గించి, బ్రౌన్, బ్లాక్, రెడ్ రైస్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.