పీచ్ పండుతో ఆరోగ్యం.. అందం మీ సొంతం..

Jyothi Gadda

09 June 2025

పీచ్‌ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో ఆరోగ్యమైనకరమైన ప్రయోజనాలు పుష్కలం అంటున్నారు నిపుణులు.

పీచ్ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పండు. 

పోషకాలు పుష్కలం ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది.

విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్‌ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరిచి ఇది క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

పొడి చర్మం ఉన్నవారు ఈ పండు ముక్కను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పీచ్‌ పండును తీసుకోవటం వల్ల హానికరమైన అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. పీచ్ పండులో విటమిన్ సీ, బీటా కెరోటీన్‌ ఉంటుంది. చర్మానికి నిగారింపునిస్తుంది.

పీచు పండులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ముడతలు తొలగిపోయి చర్మ రంధ్రాలలోని మలినాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది. 

ఈ పీచు పండులో విటమిన్ సి, పొటాషియం, పోషకాలు దట్టంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పీచు పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.