పుచ్చకాయ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి . అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా పుచ్చకాయను తింటుంటారు.
అయితే పుచ్చకాయ తినేసి చాలా మంది గింజలు పారేస్తారు. కానీ గింజలతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో తెలుసుకుందాం.
పుచ్చకాయ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మన శరీరం ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరిచి, జీవక్రియకు సహాయపడతాయి.
పుచ్చకాయ గింజల్లో లైకోపీన్ అనే యాక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మం నిగారింపుగా తయారయ్యేలా చేస్తారు.
పుచ్చకాయ గింజల నూనెలో 20% సంతృప్త కొవ్వు, ఒమేగా-6, అనేక అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఎండిన విత్తనాలలో 50 గ్రాముల కొవ్వు ఉంటుంది.ఇది జుట్టును ఒత్తుగా చేస్తుంది
పుచ్చకాయ గింజలు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి జుట్టు, చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రపంచంలోని పేద దేశాలలో ప్రోటీన్ లోపం ఒక ప్రధాన సమస్య. కానీ పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది ఈ లోపాన్ని తీరుస్తుంది.
అంతే కాకుండా పుచ్చకాయ గింజలు తినడం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.