సామలు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే..

Jyothi Gadda

08 July 2025

సామలు అద్భుతమైన సిరి ధాన్యాలు. వీటి ఉపయోగంతో శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.  

సామలు అనేవి చిరుధాన్యాల కోవకు చెందిన ఒక రకమైన గింజలు. వీటిని ఆంగ్లంలో లిటిల్ మిల్లెట్ అంటారు. భారతదేశంలో వీటిని అనేక ప్రాంతాల్లో పండిస్తారు, ఆహారంగా ఉపయోగిస్తారు. 

సామలు పోషక విలువలు కలిగిన ఆహారం. వీటిలో పీచు పదార్థం, ఖనిజాలు విటమిన్లు, పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ లేని ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక.

సామలు సహజంగా గ్లూటెన్ రహితమైన ఆహారం. గ్లూటెన్ పడని వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. గోధుమలు, బార్లీ వంటి వాటికి బదులుగా సామల వాడకంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు.

సామలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. కాబట్టి, మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

సామలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సాఫీగా చేస్తుంది.

సామలలో మెగ్నీషియం ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ B3 (నియాసిన్) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

సామలలో ఫాస్పరస్ ఉంటుంది, ఇది కొవ్వుల జీవక్రియ, శరీర కణజాలాల మరమ్మత్తు, శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది. మానవ శోషరస వ్యవస్థను శుద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.