మల్బరీ పండ్లతో క్యాన్సర్‌కు చెక్ పెట్టండిలా..!

Jyothi Gadda

22 May 2025

పాలీఫెనాల్ పిగ్మెంట్ యాంటీఆక్సిడెంట్లు, లిపిడ్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. మల్బరీలు తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మల్బరీ పండ్లోల జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరి సమస్యలను దూరం చేస్తుంది.

మల్బరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మల్బరీ పండ్లలో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే ఆంథోసైనిన్‌లు ఉంటాయి. వీటిలో రెస్వెరాట్రాల్‌‌ కూడా ఉంటాయి. 

వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గుండె నుంచి ఇతర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రొత్సహిస్తుంది.

మల్బరీలు రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తంగా ఉంచుతాయి. మల్బరీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

మల్బరీలో విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌ ఎముక కణజాలం, ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. ఎముక క్షీణత, బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి.

బ్లాక్‌, రెడ్‌, వైట్‌ మల్బరీస్‌ ఉంటాయి. దీనిలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే.. ఫైటోన్యూట్రియెంట్ సమ్మేళనాలు ఉంటాయి.