వర్షాకాలం మొదలైందంటే చాలు దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది దోమలకు భయపడి పోతుంటారు. ఎందుకంటే కొన్ని సార్లు ఇవి అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయి.
అయితే వానకాలంలో దోమలు ఇంట్లోకి రాకూడదు అంటే తప్పకుండా కొన్ని రకాల మొక్కలను మీ ఇంట్లో పెంచుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
యూకలిస్టస్ మొక్క ఇంటి ఆవరణంలో గనుక ఉన్నట్లైతే ఆ మొక్క ఇంటిలోపలికి దోమలు రాకుండూ చూస్తుందంట. దీంతో దోమల భయం,బెడద రెండూ ఉండవు.
అలాగే,రోజ్మేరీ మొక్క గనుక మీ ఇంట్లో ఉంటే దోమల వస్తాయని భయపడాల్సిన చింతే లేదు.ఎందుకంటే రోజ్మేరి వాసనకు దోమలు దరి చేరవంట.
బంతి పూల చెట్లు లేదా బంతి పువ్వులు ఇంట్లో ఉన్నా దోమలు దరి చేరవంట. ఇవి దోమలను, ఇతర కీటకాలను ఇంట్లోకి రానివ్వవు. అందుకే ఇంటి బయట తప్పకుండా ఈ మొక్కలను పెంచుకోవాలంట.
లెమన్ గ్రాస్ చెట్టు ఇంటి ఆవరణంలో ఉన్నా, దోమలు ఇంటిలోపలకి రావంట. దీని నుంచి వచ్చే బలమైన వాసన దోమలను దరి చేరనివ్వదంట. అందుకే చాలా మంది తమ పెరట్లో లెమన్ గ్రాస్ చెట్లను పెంచుకుంటారు.
లావెండర్ నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే ఈ స్మెల్ దోమలకు అస్సలే నచ్చదంట. ఈ మొక్క ఇంట్లో ఉంటే దోమలు అస్సలే రావంటున్నారు నిపుణులు.
ఇవే కాకుండా పూదీన మొక్క ఇంటి ఆవరణంలో ఉన్నా కూడా దాని వాసనకు దోమలు రావు అంట. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను పెంచుకోవాలంట.