పాలు, నెయ్యి కలిపి తీసుకోవడం మంచిదేనా?

Samatha

25 November 2025

పాలు , నెయ్యి రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని వేరు వేరుగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు.

అయితే చాలా మందిలో ఉండే అతి పెద్ద డౌట్, పాలు, నెయ్యి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? అని కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజూ గ్లాస్ పాలు తాగడం వలన ఇది ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, రాత్రి సమయంలో హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. శరీరానికి చాలా మేలు చేస్తాయి.

ఇక పాలల్లో ప్రోటీన్ భాస్వరం, విటమిన్ డి, కాల్షియం, జింక్, బి12, అయోడిన్ , యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తి అందేలా చేస్తాయి.

ఇక నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఓమేగా కొవ్వు ఆమ్లాలు అధిక మొత్తంలో ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తుంది.

అయితే ఈ రెండు కలిపి తీసుకోవడం వలన ఇది ఎముకల సమస్యతో బాధపడుతున్నవారికి,  అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుందంట. ఎముకలను దృఢంగా చేస్తుందంట.

కంటి ఆరోగ్యానికి కూడా పాలు, నెయ్యి చాలా మంచిది. వీటిని కలిపి తీసుకోవడం వలన కంటి చూపు మెరుగు పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే నెయ్యి,పాలు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుందంట. ఇందులో ఉండే పొటాషియం హృదయ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.