రాత్రి సమయంలో మామిడిపండ్లు తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

samatha 

1 MAY 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడిపండ్లను, పచ్చి మామిడికాయలను తింటుంటారు.

మామిడి పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

అయితే మామిడిపండ్లు తినడానికి చాలా మంది సమయం చూసుకోరు. వారికి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుుడు వీటిని తింటుంటారు.

కొంత మంది రాత్రి సమయంలో ఎక్కువగా మామిడిపండ్లు తింటారు. కానీ ఇలా అస్సలే తినకూడదంటున్నారు వైద్య నిపుణులు.

రాత్రి పూట మామిడిపండ్లు తినడం వలన జీర్ణసంబంధమైన సమస్యలు వస్తుంటాయంట. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రాత్రి సమయంలో మామిడిపండ్లు తినడం వలన గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, బరువు పెరగడం, వంటి సమస్యలు తలెత్తుతాయంట.

ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ రాత్రి సమయంలో మామిడి పండ్లు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.

నైట్ టైమ్ మామిడిపండు తినడం వలన కేలరీలు శరీరానికి అవసరానికి మించి శక్తిని అందిస్తాయి. దీని వలన శరీర అవయవాలు విశ్రాంతి తీసుకోలేవంట.