కరకరలాడే అప్పడాలు.. గుండె ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకోండి!
samatha
13 MAY 2025
Credit: Instagram
పప్పు సాంబర్ అప్పడాలు ఈ కాంబినేషనే వేరె లెవల్ కదా.. చాలా మంది అన్నంతో పాటు అప్పడాలు కూడా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
వయసుతో తేడా లేకుండా చిన్న నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా అప్పడాలు తింటారు. ఇక ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే అప్పడాలు అనేవి తప్పకుండా ఉంటాయి.
అప్పడాలు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా వీటిని తినడం వలన బోలేడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అప్పడాలు తినడం వలన కలిగే లాభాలు ఏవంటే?
అప్పడాల్లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ , విటమిన్స్, ఆరోగ్య కరమైన కొవ్వులు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదంట.
అంతే కాకుండా అప్పడాలు తినడం వలన ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. అంతే కాకుండా ఆకలి పెరిగేలా చేస్తుంది. అందువలన తప్పకుండా అన్నంతోపాటు అప్పడాలు కూడా తినాలంట.
అప్పడాలను తినడం వలన ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరిచి కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
అప్పడాల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఇవి చర్మా ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి
ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడే వారికి అప్పడాలు కొండంత బలం అని చెప్పవచ్చు. వీటిని తినడం వలన గుండె పనితీరు మెరుగు పడుతుందంటున్నారు నిపుణులు.