అప్పుడప్పుడు నిద్రలో నవ్వుతారు... మరి దానికి కారణం ఏంటో తెలుసా?

samatha 

4 MAY 2025

Credit: Instagram

కంటి నింద్ర పోతే చాలా ఆరోగ్యంగా ఉంటారంటారు. కానీ కొంత మంది నిద్రపోయిన తర్వాత చేసే విన్యాసాలు చూస్తే నవ్వు అపుకోలేరు.

కొంత మందికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటే, మరికొంత మందికి నిద్రలో ఏవో ఏవో మాట్లాడుతుంటారు.

ఇంకొంత మంది అయితే ఏకంగా నిద్రలో చాలా నవ్వేస్తూ ఉంటారు. అయితే ఇలా నిద్రలో నవ్వడంపై నిపుణులు పలు విషయాలు తెలిపారు.

నిజానికి నిద్రలో నవ్వుకోవడం అనేది న్యూరాలాజికల్ సమస్యనంట. అంతే కాకుండా ఇలా పడుకున్నప్పుడు నవ్వడానికి పలు కారణాలు ఉన్నాయంట అవి :

అయితే కొంత మంది మనశ్శాంతికి ఎలాంటి టెన్షన్స్ లేకుండా పడుకున్నప్పుడు మెదడు లైట్ హార్డెడ్ కలల్ని ప్రాసెస్ చేస్తుందంట. అలాంటి సమయంలో కొందరు పడుకున్నప్పుడు నవ్వుతారంట.

అదే విధంగా, కొంత మంది కలలు కంటున్న సమయంలో వారి మొదడు నవ్వును ప్రేరేపిస్తుందంట. అటువంటి సమయంలో నిద్ర పోతున్నప్పుడు నవ్వుతారంట.

అలాగే, నిద్ర పరంగా చాలా మందిలో జన్యుపరమైన లక్షణాలు ఉంటాయి. అలాగే జన్యుపరమైన సంబంధం ఉన్న వ్యక్తి కూడా నిద్రలో నవ్వుతుంటాడంట.

అలాగే కొంత మంది న్యూరాలిజకల్ డిజాస్టర్ వలన మరికొంత మంది మానసిక ఒత్తిడి, స్ట్రెస్‌కు గురి అయినప్పుడు నిద్రలో నవ్వుతారు అంటున్నారు నిపుణులు.