ఏంటీ ఏం వాడినా జుట్టు రాలడం ఆగడం లేదా..మీ కోమే అద్భుతమైన చిట్కాలు!
Samatha
5 January 2026
చాలా మందిని బాధపెడుతున్న అతి పెద్ద సమస్యల్లో జుట్టురాలడం ఒకటి. యువత నుంచి పెద్దవారి వరకు చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.
జుట్టు రాలడం
తీసుకుంటున్న ఆహారం , లైఫ్ స్టైల్ , వర్క్ ప్రెషర్, కుటుంబ సమస్యలు, ఒత్తిడి వలన చాలా మంది జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
జీవనశైలి
దీంతో జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రొడక్ట్స్ వాడినప్పటికీ, సమస్య మాత్రం తగ్గడం లేదు, కాగా, ఇప్పుడు మనం దీని కోసం నేచురల్ టిప్స్ చూద్దాం.
నేచురల్ టిప్స్
జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారం రోజులకు ఒకసారి తలస్నానం చేసి, జుట్టును శుభ్ర పరుచుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుందంట.
జుట్టును శుభ్రపరచడం
అదే విధంగా ఉల్లిరసం కూడ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కనీసం వారం రోజుల్లో ఒక్కసారి అయినా సరే జుట్టుకు ఉల్లిరసం అప్లై చేయడం వలన జుట్టు వేగంగా పెరుగుతుంది.
ఉల్లిరసం
అలాగే, ఉసిరికూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు ఉసిరి పొడిని కొబ్బరి నూనెతో కలిపి పెట్టుకోవడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.
ఉసిరి
అదే విధంగా టీ పొడిని కూడా జుట్టుకు అప్లై చేసుకోవడం వలన జుట్టురాలే సమస్య తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
టీ పౌడర్
అలాగే అతిగా జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు, మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం, విటమిన్ డి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంట.