అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో నల్ల మిరియాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది.
అర టీస్పూన్ మిరియాల పొడిని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం పోతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. శ్వాస సులువు అవుతుంది.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని మిరియాలు, కొద్దిగా అల్లం, కొన్ని తులసి ఆకులు, కొద్దిగా పసుపు, కొన్ని లవంగాలను వేసి బాగా మరిగించాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగితే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొద్దిగా మిరియాల పొడిని, పసుపును తీసుకుని ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి పూట తాగుతుండాలి. దీని వల్ల కూడా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ర్ణ సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.