కరక్కాయతో ఎన్ని ప్రయోజనాలో... తెలిస్తే షాక్ అవుతారు..!

Jyothi Gadda

08 June 2025

ఎన్నోఔషధ గుణగణాలు కలిగిన కరక్కాయలో చలవ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు చిన్న కరక్కాయ ముక్కను బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది.

కరక్కాయ దీర్ఘకాలిక దగ్గుకు మంచి పరిష్కారం. చిన్న పిల్లలకు కూడా కరక్కాయ పొడి పాలలో కలిపి తినిపించవచ్చు. దీంతో జలుబు, దగ్గు తగ్గిపోతుంది. అంతేకాదు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కరక్కాయతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు కరక్కాయ పొడిని ముఖానికి అప్లై చేస్తే కూడా మొటిమలు మాయం అవుతాయి. ముఖం కాంతివంతంగా మారిపోతుంది.  

కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో కలిపి తీసుకుంటే తగ్గుతాయి.

కరక్కాయ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా ఇది తోడ్పడుతుంది. త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది.  

కరక్కాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషాలను బయటకు పంపించేస్తాయి. ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కొవ్వు కరిగించేందుకు సహకరిస్తుంది.  

కరక్కాయ పొడిలో ఉప్పు చేర్చి.. దంతదావనం చేస్తే చిగుళ్లు గట్టిపడి వ్యాధులు రావని పెద్దలు చెపుతుంటారు. కరక్కాయ నమలడం వలన పిప్పిపన్ను పోటు తగ్గుతుందట. 

భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటుంటే రక్తమొలలు తగ్గిపోతాయని చెపుతుంటారు.