పసుపు వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యమే గాకుండా ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొనే దివ్య ఔషధం కూడా. ఇది శ్వాసకోశ వ్యాధులకు చక్కటి మందులా పనిచేస్తుంది.
పసుపు వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యమే గాకుండా ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొనే దివ్య ఔషధం కూడా. ఇది శ్వాసకోశ వ్యాధులకు చక్కటి మందులా పనిచేస్తుంది.
ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.
వాతావరణ మార్పుల వల్ల అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లకు పసుపు చక్కటి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవాలంటే పసుపు టీ మంచిది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రించడంలోనూ పసుపు ఉపయోగం చాలా ఉంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.