పెరుగు హెల్తీ ఫుడ్. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో మంచి బ్యాక్టీరియా కూడా మెండుగా ఉంటుంది.
ప్రతిరోజూ తప్పనిసరిగా పెరుగు తినటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పెరుగులో కాల్షియంతో పాటుగా భాస్వరం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంట పెరుగును తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.
అలాగే ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పాలను పులియబెట్టి పెరుగును తయారుచేసే కిణ్వ ప్రక్రియ ప్రక్రియ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
హెల్తీ గట్ మైక్రోబయోమ్ మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి, ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. జీర్ణశయాంతర సమస్యలు తగ్గిస్తుంది.
కణాల పనితీరును మెరుగుపరిచి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే మీకు అంటువ్యాధులు, ఇతర రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
పెరుగులో ఉండే కాల్షియం, భాస్వరం ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. పెరుగును తింటే ఎముకల పగుళ్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
పెరుగులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే మీరు కేలరీలు తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తుంది.