పొన్నగంటి కూర తింటున్నారా.. ? అయితే జరిగేది ఇదే..!

Jyothi Gadda

10 July 2025

బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. అలాగే ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. 

కంటి కలకలు, కురుపులతో బాధపడేవారు కూడా పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. 

పొన్నగంటి కూరను తింటే పురుషులకు కావల్సిన శక్తి సమకూరుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా తగ్గిస్తుంది.

ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఉండి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వెన్ను నొప్పికి ఇది చక్కగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడుతుంది.

పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. 

గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి.