లవంగాలు..ప్రతి వంటింట్లో ఉండే మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్పగుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
లవంగం ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. లవంగాలు తినడం వల్ల బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, లవంగాలని తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలు దూరమవుతాయి.
లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సాయపడుతుంది.
లవంగాలు బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన రక్తాన్ని క్లీన్, హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి.
లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్స్‌తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి.
లవంగాల్లోని ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సాయపడతాయి. కడుపులో అల్సర్‌తో బాధపడేవారికి కూడా లవంగాలు తీసుకోవడం మంచిది.
ఇవి స్పీడ్‌గా బరువుని తగ్గిస్తాయి. ఇందులో యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, విటమిన్స్ ఈ, సి, కె, ఎలు ఉన్నాయి. ఇవి జీవక్రియని పెంచి, కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయి.