పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్య నిపుణులు కూడా తప్పకుండా రోజులో కనీసం ఒక్క పండైనా తినాలని చెబుతుంటారు.
అందుకే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఏదైనా ఒక పండు తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో మాత్రం అస్సలే కొన్ని పండ్లు తిన కూడదంట. అవి ఏవో చూద్దాం.
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దీనిని ఉదయం పరగడపున తినకూడదంట. దీనిని ఖాళీ కడపుతో తినడం వలన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణం అవుతుందంట.
బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన జీర్ణ సమస్యలు అధికం అవుతాయంట. అంతే కాకుండా , కొన్ని సార్లు తల తిరగడం వంటి సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉన్నదంట.
చాలా మంది ఉదయాన్నే పరగడుపున అరటి పండు తింటారు. కానీ ఇలా ఉదయాన్నే అరటి పండు తినడం కూడా మంచిది కాదంట, పరగడుపునే అరటి పండు తింటే, కళ్లు తిరగడం , జీర్ణ సమస్యలు వస్తాయంట.
సీతాఫలం శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఉదయాన్నే తింటారు. కానీ దీనిని పరగడుపున తినడం వలన జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదంట.
ద్రాక్ష పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, అందుకే వీటిని ఖాళీ కడుపుతో తినకూడదంట.
సిట్రస్ పండ్లు కూడా ఖాళీ కడుపుతో తినకూడదంట. ఇది గ్యాస్ ,కడుపులో మంట, కడుపు ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది. నోట్ : కేవలం ఇంటర్నెట్ సమాచారం మేరకే ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.