08 December 2025

పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా?

samatha

Pic credit - Instagram

పాలు తాగని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఇష్టంగా పాలు తాగుతుంటారు. కొందరు పాలు తాగడానికి ఎక్కువ ఇష్టం చూపరు.

అయితే పాలు అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది, అవి తెలుపు రంగులో ఉంటాయి. మరి పాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

పాలల్లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తాగడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

అయితే ఇందులో కేసిన్ అనే ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయంట. అందువలన పాలు తెల్లగా కనబడతాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ఉండే కేసిన్ కొవ్వు గ్లోబుల్స్ కాంతిని అన్ని దిశలా చెదరగొట్టేస్తుంది.

ఇలా కాంతి వికీర్ణం చెందడం వలన పాలు తెలుపు రంగులో కనిపిస్తాయంట. అంతే కాకుండా ఇవి సహజ మెరుపును కలిగి ఉంటాయంట.

ముఖ్యంగా విరిగిన పాలల్లో కేసిన్ మైసెల్స్ కాంతిని దాటనివ్వకుండా చేయడం వలన పాల రంగు తెల్లగా చేస్తాయంట.

ఇక కొవ్వు ఎక్కువగా ఉన్న పాలల్లో కేసిన్ అనేది ఎక్కువగా వ్యాపించడం వలన ఇది ఎక్కువ ప్రకాశవంతంగా కొత్త మెరుపుతో కనిపిస్తాయి.

అలాగే ఆవు పాలల్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వలన ఈ పాలు కాస్త పసుపు వర్ణంతో కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.