ఉసిరి జ్యూస్ ఎవరు తాగడం ప్రమాదకరమో తెలుసా?

Samatha

30 october 2025

ఉసిరి జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఎక్కువగా ఉసిరి జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

ఉసిరి జ్యూస్ తాగడం వలన ఇది జర్ణక్రియ మెరుగు పడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి ఉసిరి జ్యూస్ చాలా మంచిదని చాలా మంది తాగుతుంటారు.

 కానీ ఉసిరి జ్యూస్ తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం దీనిని అస్సలే తాగకూడంట. కాగా ఎవరు ఉసిరి కాయ జ్యూస్ తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మలబద్ధకం సమస్యతో బాధపడే వారు ఉసిరి జ్యూస్ తీసుకోకపోవడమే మంచిదంట. ఇందులో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన ఇది మలబద్ధకం సమస్యను తీవ్రతరం చేస్తుంది.

అలాగే ఉసిరిలో సహజంగానే ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. అందువలన గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్షన్స్ , కడుపు తిమ్మరి ఉన్నవారు దీనిని తీసుకోకూడదంట. దీని వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుందంట.

ఉసిరి జ్యూస్ మాములు వ్యక్తులు తాగడం మంచిది కానీ, డయాబెటీస్ మందులు వాడే వారు దీనిని తాగకూడదంట. ట్యాబ్ లెట్స్‌తో ఇది కలిసి నప్పుడు, తక్కువ రక్తంలో చక్కర స్థాయిలకు కారణం అవుతుందంట.

రక్త స్రావం లేదా రక్తం గడ్డలు కట్టే సమస్యలు ఉణ్నవారు కూడా ఉసిరి జ్యూస్ అతిగా తీసుకోకపోవడమే మంచిదంట. ఉసిరి జ్యూస్ రక్తాన్ని పలచబరిచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే రక్త స్రావం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

అలాగే, మూత్ర పిండం లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా ఉసిరి జ్యూస్ అధికంగా తీసుకోకూడదంట, వైద్యుల సలహా మేరకే ఉసిరి జ్యూస్ తాగడం మంచిదంట.