03 December 2025

ఒంటరిగా ఉన్నప్పుడు సడన్‌గా గుండె నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసా?

samatha

Pic credit - Instagram

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె పోటు బారినపడుతున్నారు. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ గుండెపోటు సమస్యలతో మరణిస్తున్నారు.

అయితే కొన్ని సార్లు ఒంటరిగా ఉన్నప్పుడు గుండె పోటు కాకుండా, గుండెలో నొప్పి రావడం జరుగుతుంది. దీంతో చాలా మంది భయపడి పోయి టెన్షన్‌ వలన సమస్యను పెద్దది చేసుకుంటారు.

అయితే మీరు గనుక ఒంటరిగా ఉన్నప్పుడు గుండెలో నొప్పి వస్తే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

గుండె నొప్పి వచ్చినప్పుడు ఆందోళన, భయం కలగడం కామన్, కానీ ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది, ప్రాణాన్ని నిలబెట్టుకున్న వారు అవుతారంట.

మీకు గుండెలో నొప్పి వస్తే ముందుగా అస్సలే టెన్షన్ తీసుకోకూడదు. వీలైతే మీ దగ్గర ఫోన్ ఉంటే అత్యవసర సేవలకు కాల్ చేయడం ఉత్తమం.

అలాగే మీకు గుండె నొప్పి వచ్చినప్పుడు ముందుగా ప్రశాంతంగా ఉండాలంట, అలాగే ఇంటిలోకి గాలి వచ్చేలా, కిటికీలు, తలుపులు అన్నీ తీసి ఉంచడం మంచిది.

గుండెలో నొప్పి వచ్చినప్పుడు శారీరక శ్రమ చేయడం అస్సలే మంచిది కాదు. అలాగే ఏదైనా తినడం లేదా తాగడానికి కూడా ప్రయత్నించ కూడదు అంటున్నారు నిపుణులు.

శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించాలి. మంచి గాలి వచ్చే ప్రదేశంలో ఉండాలి.  నెమ్మదిగా ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం చాలా మంచిది.