కృత్రిమంగా పండించిన పండ్లు గుర్తించడానికి బెస్ట్ టిప్స్ ఇవే!
samatha
22 MAY 2025
Credit: Instagram
ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్కెట్లో మామిడి పండ్లు దర్శనం ఇస్తున్నాయి. ఇక సీజనల్ ఫ్రూట్ కావడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
అంతే కాకుండా మామిడిపండ్లు తినడానికి కూడా రుచికి బాగుండటంతో ఎంతో ఇష్టంగా మామిడి పండ్లను తింటుంటారు.
అయితే మామిడి పండ్లు సహజంగా పండినవి, కొన్ని మందులతో పండించినవి ఇలా రెండు రకాలు ఉంటాయి. సహజంగా పండించిన మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి.
గతంలో రైతులు మామిడిపండ్లను చెట్లపైనే ఉంచి, అవి పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే కోసి ఒక ప్రత్యేక గదిలో పెట్టే వారు. దీంతో అవి సహజంగానే ఇథిలిన్ రసాయనాన్ని విడుదల చేస్తాయి.
కానీ ఈ రోజుల్లో మామిడి పండ్లను సులభంగా మామిడి పండ్లను పండించడానికి చాలా మంది రసాయనాలు ఉపయోగిస్తున్నారు. దీని వలన పండ్లు కేవలం రెండు రోజుల్లోనే పండుతాయి.
అందువలన అసలు మార్కెట్‌లో సహజంగా పండిన మామిడిపండ్లను, కృత్రిమంగా పండించిన పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొనుగోలు చేసిన మామిడిపండ్లను నీటితో నిండిన పాత్రలో ఉంచండి. అది సహజంగా పండిన పండు అయితే అడగుకు వెళ్తుంది.కృత్రిమంగా పండిన పండు అయితే పైన తేలుతుంది.
అలాగే కృత్రిమంగా పండించిన మామిడి పండ్ల మాబిడి తొక్క కొన్ని చోట్ల ఆకుపచ్చ రంగు ఉంటుంది. సహజంగా పండినదానికి ఆకుపచ్చ రంగు ఉండదు.