వంటల్లో ఉపయోగించే పచ్చి మిర్చి ప్రయోజనాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే!
samatha
12 MAY 2025
Credit: Instagram
ఏ కూర వండాలన్నా సరే పచ్చి మిర్చి తప్పనిసరి. దీనిని వంటల్లో వేసుకోవడం వలన ఆ వంటకాలకే మంచి రుచి వస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ కర్రీస్ చేసే క్రమంలో తప్పకుండా పచ్చిమిర్చి వాడుతుంటారు. అయితే చాలా మందికి దీని ప్రయోజనాలు తెలియదు. కాగా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మిర్చిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ , పొటాషియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
పచ్చి మిర్చిని ప్రతి రోజూ వంటల్లో వేసుకోవడం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
పచ్చిమిరపకాయలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కేలరీలు లేవు. అందువలన దీనిని తినడం వలన ఇది బరువును నియంత్రణలో ఉంచుతుంది.
పచ్చి మిర్చీలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అందువలన ఇది కళ్లకు, చర్మానికి మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు
పచ్చి మిర్చీలో బీటా కరోటిన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పచ్చి మిర్చీని వంటల్లో ఉపయోగించడం వలన ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చి మిర్చీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు శక్తిని అందించడమే కాకుండా క్యాన్సర్ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అందుకే తప్పకుండా మీ వంటల్లో పచ్చి మిర్చి వాడాలి అంటారు నిపుణులు.