రెడ్ వైన్ తాగటం మంచిదా.. కాదా? తప్పక తెలుసుకోవాల్సిందే!
Jyothi Gadda
04 July 2025
రెడ్ వైన్ తాగడం వల్ల లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని వివిధ రకాల ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు. ద్రాక్షను పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది.
రెడ్ వైన్ మితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బుల బారి నుండి కాపాడుకోవచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుందని, ఎముకల ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి పెరుగుతుందని, నిద్రలేమి సమస్య నుంచి కాపాడుతుందని చెబుతున్నారు. ఇది రక్తపోటును నియంత్రిస్తుందని, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అంటున్నారు.
రెడ్ వైన్‌లోని సమ్మేళనాలు మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను నియంత్రించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంటే ఇది మానసిక ఒత్తడిని తగ్గిస్తుంది. మంచి నిద్రకు దోహదం చేస్తుంది.
రెడ్ వైన్ సీరం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డార్క్ స్పాట్స్ ని పూర్తిగా తొలగిస్తుంది. డెడ్‌స్కిన్ సెల్స్‌ని తొలగించి, ముఖాన్ని ప్రకాశవంతంగా మెరిపిస్తుంది. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
దీన్ని తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య కూడా దూరమవుతుంది. క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేయడంలో ఈ వైన్ సహాయ పడుతుంది.
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రెడ్ వైన్‌లోని రెస్వెరాట్రాల్ అనే యాంటీ అలెర్జిక్ లక్షణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
రెడ్ వైన్ ఎముకలను బలోపేతం చేయడంలో దోహదపడుతుంది. అతిగా తాగితే షుగర్, ఊబకాయం, నరాల సమస్యతోపాటు నిద్రలేని వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.
రెడ్ వైన్ తీసుకోవడం వల్ల టైప్ 2 షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్‌తో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా సూచన మేరకు తీసుకోవాలి.