స్త్రీకి గౌరవం చాలా అవసరం.. మహిళల కోసం చాణక్యుడు చెప్పివి ఇవే

samatha 

4 MAY 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా కూడా పేరు పొందాడు. తన జీవితకాలంలో, ఆయన అనేక రకాల విధానాలను రచించాడు.

ముఖ్యంగా చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవులకు ఉపయోగపడే అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

అంతే కాకుండా ఈయనమహిళల గౌరవం, వారి భద్రత మరియు సమాజంలో వారి పాత్ర గురించి చాణక్యుడు అనేక ముఖ్యమైన విషయాలను చెప్పాడు. అవి 

సమాజంలో మహిళల ప్రవర్తన, దుస్తులు ధరించడం లేదా మాట్లాడే విధానం గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం తరచుగా కనిపిస్తుంది. 

అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి వారికి మర్యాద గురించి సలహా ఇస్తే, అది అతని బాధ్యతకు సంకేతం. కానీ కించపరిచేలా మాట్లాడకూడదన్నారు.

చాణక్యుడు మహిళల గురించి చెబుతూ.. స్త్రీలు తమ సొంత విలువలను గుర్తించుకోవాలి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం గొప్ప బలాలు అని తెలిపారు.

అదే విధంగా మహిళలు మీ నియమాలు మీరు పాటించాలి. అవి మీ సొంత రక్షణకు ఉపయోగంగా ఉంటాయి అని ఆయన పేర్కొవడం జరిగింది

తప్పుడు సహవాసం వ్యక్తిత్వానికి ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. అలాటి వాటికిదూరం ఉండాలి, మీ అభిప్రయాలను సమాజానికి బలంగా వినిపించాలన్నారు.