చాణక్య నీతి : ఈ నాలుగు పాటిస్తే జీవితంలో గెలుపు మీ సొంతం

samatha 

28 MAY 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప  పండితుడు. అంతే కాకుండా అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

అలాగే చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది

ముఖ్యంగా బంధాలు , బంధుత్వాలు, విజయం, అపజయం, గెలుపోటములు, భార్య,భర్తలు ఇలా చాలా విషయాల గురించి వివరంగా తెలిపారు.

అదే విధంగా ఆచార్య చాణక్యుడు జీవితంలో ఉన్నతంగా బతకాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలన్నారు.

కాగా, జీవితంలో గెలుపు సాధించాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలో.. చాణక్యుడు చెప్పిన సూత్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడు కాలం అత్యంత విలువైనదని అంటాడు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారే జీవితంలో ముందుకు సాగుతారు. సమయం వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు వెనక్కి నెట్టుకోవడం.

చాణక్యుడి ప్రకారం, మీ జీవితం మీరు ఎవరితో సహవాసం చేస్తారో అదే ఉంటుంది. చెడ్డవారి సహవాసం ఒక వ్యక్తిని దిగజార్చుతుంది.మంచి వారిది తెలివిని పెంచుతుందంట.

చాణక్యుడి ప్రకారం నీ చేతిలో ఉన్న డబ్బు, నీ ప్రణాళికలు, నీ బలహీనతలు ఎవ్వరికీ చెప్పుకోకూడదు. ఇవి నీ జీవితాన్ని దిగజార్చుతాయని చెబుతున్నాడు చాణక్యడు.