చాణక్య నీతి : ఇలాంటి వారి వద్ద ఎప్పుడూ లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్టపడదంట!

samatha 

12 MAY 2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరుపొందాడు.

అంతే కాకుండా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా అనేక విషయాలను మానవ వాళికి తెలియజేశాడు. ఎప్పుడూ చెడుగా ప్రవర్తించకూడదంటూ తెలిపారు.

అయితే ఆచార్య చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా కొంత మంది దగ్గర ఎప్పుడూ డబ్బు నిలవదు అంటూ కూడా తెలిపారు.

ఇలాంటి వ్యక్తులతో తప్పుగా ప్రవర్తించిన వారిపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది. మీతో ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడదంటూ తెలిపారు. వారు ఎవరంటే.

చాణక్యుడి ప్రకారం మీ జీవితంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో తప్పుగా ప్రవర్తించకూడదంట. దీని వలన లక్ష్మీ దేవి ఉండకపోవడమే కాకుండా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట.

జీవితంలో గురువుది కూడా కీలక పాత్ర ఉంటుంది. మచి చెడు ఇవన్నీ గురువే నేర్పిస్తాడు. అందువలన గురువు పట్ల కూడా తప్పగా ప్రవర్తించకూడదంట. ప్రవర్తిస్తే జీవితంలో ఏం సాధించలేరంట.

చాణక్య నీతి ప్రకారం, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించే వారితో లక్ష్మీ దేవి ఎప్పుడూ ఉండదు. వారితో తప్పుగా ప్రవర్తించే ఏ వ్యక్తి అయినా ఎంత ప్రయత్నించినా జీవితంలో పురోగతి సాధించలేడు.

చాణక్య నీతి ప్రాకారం పేద వారిని లేదా నిస్సహాయిలను ఎప్పుడూ ఎగతాళి చేయకూడదంట. దాని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.