ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వారంలో కనీసం రెండు సార్లు ఆకు కూరలు తింటుంటారు.
అయితే వర్షాకాలం వస్తే చాలు అస్సలే ఆకు కూరలు తినకూడదంటారు ఎందుకంటే?ఆకు కూరలు భూమికి చాలా దగ్గరగ పెరుగుతాయి. అంతే కాకుండా వాటి ఆకులు కాండాలు భూమిని తాకుతూ ఉంటాయి.
వర్షకాలంలో నీరు వరదలా పారుతూ ఉంటుంది. ఆ నీరు ఆకు కూరలను తాకుతూ వెళ్తుంది. దీని వల్ల ఆకు కూరలకు బ్యాక్టీరియా అంటుకోవడం లేదా, ఆకులను వరద నీరు తాకడం వలన అవి కలుషితం అవుతుంటాయి.
దీని వలన చెడు బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మజీవులు, ఇవన్నీ ఆకుల మీద చేరే అవకాశం చాలా ఎక్కవగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఆకు కూరలు తినకూడదంటారు.
అంతే కాకుండా వర్షాకాలంలో ఆకుల మీద పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే,హనీకరమైన క్రిమికీటకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
వీటన్నింటి కారణాల వలన వీలైంత వరకు వర్షాకాలంలో ఆకు కూరలు తినకూడదు అంటారు. అంతేకాకుండా కొంత మంది వర్షాకాలంలో ఆకు కూరలు తినడం వలన జీర్ణ సమస్యలు ఎదుర్కుంటారు.
కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు కూడా ఎదురు అవుతాయి. అందుకే ఆకు కూరలు కాకుండా మంచి కూరగాయలు తినాలని సూచిస్తారు వైద్యులు.
అయితే కొంత మంది ఇంటిలోనే శుభ్రమైన వాతావరణంలో ఆకుకూరలను పండించుకుంటారు. అయితే అలాంటి వారు ఆకు కూరలను ఫ్రెష్‌గా కడిగి వారానికి ఒకసారి తినొచ్చునంట.