ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో సతమతం అయ్యే వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలని చెబుతుంటారు.
మరీ ముఖ్యంగా కొంత మంది డయాబెటీస్ ఉన్న కూడా ప్రతి రోజూ కొన్ని రకాల పండ్లు తింటుంటారు. అయితే అసలు డయాబెటీస్ ఉన్న వారు పండ్లు తినవచ్చా? లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటీస్ ఉన్న వారు ప్రతి రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనంట. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు తినడం వలన డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందవచ్చునంట అవి :
యాపిల్ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట.
బేరి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఫైబర్‌తో కూడా నిండిన బేరి పండ్లు టైప్-2 డయాబెటిస్‌ను నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి తో నిండిన స్ట్రాబెర్రీలు శరీరానికి చాలా మంచివి. వీటిని ముక్కలుగా కోసి, ఓట్ మీల్, పెరుగుతో లేదా పాలకూర తినడం వలన అనేక లాభాలున్నాయి.
అరటిపండును గెల నుండి తీసేటప్పుడు, ఇంకా కొంచెం పచ్చగా ఉన్నదాన్ని ఎంచుకొని తినడం వలన అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట.
బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక, కానీ టార్ట్ మరియు జ్యుసి బ్లాక్‌బెర్రీలు వాటి స్ట్రాబెర్రీ కంటే రెట్టింపు ఫైబర్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి.