బెండకాయ నీటిలో ఇది కలిపి తాగితే..ఆరోగ్యానికి అమృతం..!
Jyothi Gadda
24July 2025
ఇప్పుడు బెండకాయ నీళ్ళు తాగడం బాగా పాపులర్ అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు తేనె కూడా కలిపి తాగుతున్నారు. దీంతో రెట్టింపు లాభాలు ఆయుర్వేదం, మోడ్రన్ సైన్స్ చెబుతోంది.
బెండకాయలో కరిగే ఫైబర్, మ్యూసిలేజ్ ఉంటాయి. నీళ్ళలో నానబెడితే జెల్‌గా తయారవుతుంది. ఇది పేగులను శుద్ధి చేసి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల వల్ల ఈ నీళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. బెండకాయలో ఉండే మైరిసెటిన్, ఫ్లేవనాయిడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
బెండకాయలోని ఫైబర్ కడుపు నిండుగా ఉంచుతుంది, దానివల్ల ఆకలి తగ్గుతుంది. ఉదయం తేనె తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బెండకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
బెండకాయ, తేనె రెండింటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. తేనె బ్యాక్టీరియాతో పోరాడుతుంది, బెండకాయ శరీరంలోని వాపును తగ్గిస్తుంది.
బెండకాయలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మం ముడతలను తగ్గిస్తాయి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది, దానివల్ల కాంతి వస్తుంది.
బెండ నీళ్ళు, తేనె అందరికీ మంచివి కాకపోవచ్చు. ఎవరైతే ఇది తాగుతున్నారో వాళ్ళు నిరంతరం తాగకూడదు. 2-3 వారాలు తాగిన తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకోవాలి.