బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బి విటమిన్, ఇ విటమిన్, భాస్వరం, పొటాషియం, తక్కువ మొత్తంలో గంజి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రజెంట్ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో రైస్ వాటర్ వాడుతున్నారు. ఈ వాటర్‌ని పులియబెట్టి మనకి అందిస్తారు కాబట్టి, చర్మానికి మంచి మెరుపు, తేమని కాపాడుకోవడానికి వాడుతున్నారు.
బియ్యం కడిగిన నీటిని వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఇది స్కిన్ కొల్లాజెన్‌ని మెరుగుపరిచి, ముడతల్ని పోగొడుతుంది. జుట్టుకు కూడా మంచిదని చెబుతారు.
ఇందులో అమైనా యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రైస్ వాటర్‌తో చర్మ స్థితిస్థాపకత మెరుగవుతుంది. చర్మంపై గీతలు, ముడతలు తగ్గి స్కిన్ అందంగా మారుతుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో బియ్యం నీరు ముందుంటుంది. దీనిని వాడడం వల్ల తామర, మొటిమలు, మచ్చలు, దురద వంటి సమస్యలు తగ్గి చర్మం మెరుగవుతుంది.
అంతేకాకుండా ఈ నీటిని వాడడం వల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది. చర్మ సమస్యలకి ముఖ్య కారణం జిడ్డు కారణం. ఈ నీటిని వాడడం వల్ల జిడ్డు దూరమై సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.
ముందుగా ఓ కప్పు బియ్యాన్ని తీసుకుని కడిగి మంచి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని వడకట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు మీ స్కిన్, జుట్టుకి అప్లై చేయొచ్చు.
ఈ వాటర్‌ని స్ప్రే బాటిల్‌లో వేసుకుని చర్మంపై స్ప్రేలా వాడొచ్చు. ఇందులో దోసకాయ రసాన్ని కలిపితే చర్మానికి హైడ్రేషన్ అందించినవారవుతాం.