కరివేపాకే అని తీసిపారేయకండి..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు 

Jyothi Gadda

27 May 2025

కరివేపాకులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

కరివేపాకులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, పీచు పోషకాలతోపాటు విటమిన్‌-సి, విటమిన్‌-బి, విటమిన్‌-ఇలు అధికం. రోజూ తీసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు.

కరివేపాకు.. దీనిని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ నుంచి బ్యూటీ బెనిఫిట్స్ వరకూ ఎన్నో లాభాలున్నాయి. వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. 

కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మంచివి. కరివేపాకుతో కీళ్ళనొప్పులు, షుగర్ బాధితుల్లో ఎముకల్ని బలంగా మారుస్తుంది.

కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. ఖాళీకడుపుతో కరివేపాకు తింటే మూత్రిపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి.

కరివేపాకులో విటమిన్‌-ఎ అధికం. ఇది కంటి చూపును మెరుగుపరచడమేకాదు, కంటి సమస్యల్ని ముందుగానే నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. 

కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. ఖాళీకడుపుతో కరివేపాకు తింటే మూత్రిపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి.

ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ బలంగా మారతుంది. ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.

కరివేపాకు తింటే LDL అనే చెడు కొలెస్ట్రరాల్ తగ్గుతుంది. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపి కూడా కంట్రోల్ అవుతుంది. హార్ట్ హెల్త్ బాగుంటుంది.