రోజూ ఓట్స్ తింటే.. మన శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

Jyothi Gadda

10 June 2025

రోజు ఉదయం ఓట్స్ తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా ఓట్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. 

ఓట్స్ లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫోలేట్, విటమిన్ బి 1, విటమిన్ బి 5 వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి.

ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్లు కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఓట్స్‌లోని కరిగే ఫైబర్లు రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. ఓట్స్‌లో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తాయి. 

డయాబెటిస్ ఉన్నవారికి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.

ఓట్స్ రోజు తినడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి మంచిది. 

ఓట్స్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.