రోజూ డార్క్ చాక్లెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Jyothi Gadda

07 July 2025

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో కోకో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్లు అనే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

సాధారణంగా చాక్లెట్‌ కంటే డార్క్‌ చాక్లెట్‌లో కోకో కంటెంట్‌ అధికం. ఫైబర్‌తో పాటు పోషకాలూ అధికంగా ఉంటాయి. అందుకే ఇది బెటర్‌ అంటారు. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను అదుపులో ఉంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

డార్క్‌ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ శరీరంలో రక్త సరఫరాను వేగం చేసేందుకు సాయపడతాయి. రక్తపోటును అదుపులోకి తీసుకొస్తాయి. 

రోజూ 30 గ్రాముల డార్క్‌ చాక్లెట్‌ను 8 వారాలు తీసుకుంటే టైప్‌ -2 డయాబెటిస్‌ అదుపులోకి వస్తుందని అధ్యయనాల్లో తేలింది. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రోజూ డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల చర్మానికి తేమ అంది మంచి నిగారింపు కనిపిస్తుంది. ఎండవల్ల దెబ్బతిన్న చర్మం కణాలను పునరుద్ధరిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.

కోకో శాతం ఎక్కువగా ఉన్న డార్క్‌ చాక్లెట్‌ని పిల్లలకు తరచూ తినిపించడం వల్ల మెదడుకి రక్తసరఫరా వేగవంతమవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధిని దూరం చేస్తుంది.

భావోద్వేగాల నియంత్రణలో డార్క్‌ చాక్లెట్‌ది ప్రధాన పాత్ర. ఒత్తిడి అదుపులోకి వస్తుంది. కోపం, చిరాకు కలిగితే కొద్దిగా చాక్లెట్‌ని తింటే సరి. దీంతో బరువు పెరుగుతారనే భయమూ ఉండదు. 

డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ , భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మంచి నిద్రకు దోహదం చేస్తాయి.