ఉదయాన్నే జీరా వాటర్‌ తాగితే.. మీ శరీరంలో ఉహించని మార్పులు.!

Jyothi Gadda

28 May 2025

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఉత్పత్తయ్యే ఆమ్లాలను నియంత్రించి, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఉత్పత్తయ్యే ఆమ్లాలను నియంత్రించి, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారి కోసం జీలకర్ర నీరు ఒక ఉత్తమమైన సహజ మార్గంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజాన్ని వేగవంతం చేసి, కొవ్వు కరిగే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. 

జీలకర్ర నీటిలో పొటాషియం అధికంగా ఉండి..రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీంతో రక్తనాళాల సంకోచాన్ని తగ్గించి, రక్తప్రసరణను మెరుగు చేస్తుంది. 

జీలకర్రలో ఉండే ఫైబర్, యాంటీ డయాబెటిక్ గుణాలు శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారికి జీలకర్ర నీరు చాలా మంచిది.

జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

చర్మ సమస్యలను దూరం చేయటంలో కూడా మేలు చేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తాయి. 

జీరా వాటర్‌ గర్భధారణ సమయంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్‌ జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను పెంచుతుంది.