పొట్టు మినపప్పు తింటే ఇన్ని లాభాలా..? 

Jyothi Gadda

11 June 2025

పొట్టు మినపప్పు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే పప్పులలో ఒకటి.  ఇది పోషక పదార్థాల్లో సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. 

పొట్టు మినపప్పులో ఉండే పోషకాలు శరీర కండరాల అభివృద్ధి కోసం అత్యవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణశక్తి కోసం దీనిలో ఉన్న ఆహార ఫైబర్ ఉపయోగపడుతుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీనిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి పెంపొందిస్తాయి. B విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. 

పొట్టు మినపప్పులో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. పేగుల్లో వ్యర్థాలను సులభంగా బయటకు పంపే విధంగా ఇది సహాయపడుతుంది.

ఐరన్ అధికంగా ఉండటం వలన రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది మంచిదిగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని తీసుకోవడం వల్ల ఉపయోగాలు పొందవచ్చు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన శక్తి వినియోగానికి, కండరాల బలవృద్ధికి ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా పొట్టు మినపప్పు వాడటం వలన శరీరం శక్తివంతంగా ఉంటుంది.

పొట్టు మినపప్పులో ఉండే పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మంపై మృతకణాలను తొలగించి చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. 

పొట్టు మినపప్పు, అనగా గింజ తొక్కు తొలగించకుండా ఉంచిన మినపప్పు. పొట్టు మినపప్పులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.