అతిగా మామిడిపండ్లు తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా? సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంట!
samatha
16 MAY 2025
Credit: Instagram
చాలా మంది ఇష్టపడే పండ్లల్లో మామిడి పండ్లు కూడా ఒకటి.సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడిపండ్లు తింటుంటారు.
అయితే మామిడి పండ్లు తినడం మంచిదే కానీ అతిగా తినకూడదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట. అవి :
మామిడిపండ్లు అధిగా తీసుకోవడం వలన ఇందులోని అధిక ఫైబర్ కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, విరేచనాల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదంట.
అలాగే అధికంగా మామిడి పండ్లు తినడం వలన చాలా త్వరగా బరువు పెరిగే అవకాశం ఉన్నది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతే కాకుండా ఎక్కువగా మామిడి పండ్లు తినడం వలన దురుద, వాపు, దద్దుర్లు వంటి అలెర్జీలు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.
ఇవే కాకుండా మామిడిపండ్లను ఎక్కువగా తింటే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. మధుమేహం ఉన్నవారికి లేదా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్నవారికి ప్రమాదకరం.
మామిడి పండ్లలో ఉరుషియోల్ అనే పదార్థం ఉంటుంది. దీని కారణంగా పోయిజన్ ఐవీ, పాయిజన్ ఓక్ ఉంటాయి. ఇవి మామిడి పండ్లు తిన్న తర్వాత నోటిలో లేదా పెదవులపై చికాకుగా, దురదలా ఉంటుంది.
మామిడి పండ్ల పై తోలును సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది.అందుకే అతిగా మామిడి పండ్లు తినకూడదంట.